Chandra Babu Naidu కు మద్దతుగా ఈనెల30న మోత మోగిద్దాం: Nara Lokesh పిలుపు

by Disha Web Desk 21 |
Chandra Babu Naidu కు మద్దతుగా ఈనెల30న మోత మోగిద్దాం: Nara Lokesh పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు అనేక నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది. బాబుతో నేను అంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు, దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. అక్రమ అరెస్ట్ చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం అంటూ లోకేశ్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం అన్నారు. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగుతేజం చంద్రబాబుకు మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది అని పిలుపునిచ్చారు. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఈనెల 30న శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాశబ్ధాన్ని వినిపిద్దాం అని నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు మోత మోగిద్దాం అంటూ పోస్టర్‌ను సైతం ట్విటర్ వేదికగా విడుల చేశారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు ఐదు కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని కోరారు. ఇంట్లోనో..ఆఫీసులోనో ఇంకెక్కడ ఉన్నా బయటకు వచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి లేదా విజిల్ వేయండి అని కోరారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టండి అని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మోత మోగిద్దాం సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా మోత మోగిద్దాం అంటూ నారా లోకేశ్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి : ఫైబర్ గ్రిడ్ స్కాంలోనూ Chandrababu Naidu పాత్ర : వైసీపీ నేత Sajjala Ramakrishna Reddy

Next Story