యువగళం బహిరంగ సభను చారిత్రాత్మకంగా నిలుపుదాం: అచ్చెన్నాయుడు

by Seetharam |
యువగళం బహిరంగ సభను చారిత్రాత్మకంగా నిలుపుదాం: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర బహిరంగ సభను చరిత్రలో నిలుపుదాం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక్క అడుగుతో మొదలై యువత ఆకాంక్షలకు, ఆశయాలకు నిలువుటద్దంగా నిలిచింది అని చెప్పుకొచ్చారు. 226 రోజులపాటు ప్రజలకు భరోసా కల్పిస్తూ 3132 కిలో మీటర్లు విజయవంతంగా సాగింది అని చెప్పుకొచ్చారు. విజయనగరం జిల్లా పోలేపల్లిలో నిర్వహిస్తున్న యువగళం - నవశకం సభను చారిత్రాత్మకంగా నిలుపుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరు కానున్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు.Next Story

Most Viewed