ఆ సమస్యలపై పాదయాత్ర చేస్తాం: దేవినేని ఉమా

by Disha Web |
ఆ సమస్యలపై పాదయాత్ర చేస్తాం: దేవినేని ఉమా
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ పాలనకు వ్యతిరేకంగా రోడ్ల బాగు చేయాలని కోరుతు జూన్ 25 నుంచి పాదయాత్ర చేపడతానని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దుగ్గిరాలపాడు నుంచి జి.కొండూరు వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. మంగళవారం ఉమా మీడియాతో మాట్లాడారు. అధ్వాన్నంగా మారిన దుగ్గిరాలపాడు-జి.కొండూరు రోడ్డు.. మరమ్మతుపై వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గుంతల మయమైన రోడ్లు కారణంగా ఏడు గ్రామపంచాయతీల ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆసుపత్రులు నరక ప్రాయంగా మారాయని ఆరోపించారు. కనీస వసతులు, పరికరాల మరమ్మత్తులకు నిధుల కేటాయించడం లేదని మండిపడ్డారు. దశాబ్ధాలుగా సేవలందిస్తున్న వైద్య వ్యవస్థను మూడేళ్లలో జగన్​ నిర్వీర్యం చేశారని విమర్శించారు. వెయ్యి దాటితే దేశంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పిన సీఎం ఎంత మొత్తం చెల్లించారో శ్వేతపత్రం విడుదల చెయాలని దేవినేని డిమాండ్​ చేశారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed