సైకో సీఎం మెడకు ఉరివేద్దాం.. కౌలు రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : చంద్రబాబు

by Disha Web Desk |
సైకో సీఎం మెడకు ఉరివేద్దాం.. కౌలు రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు : చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘రైతు పోరుబాట పాదయాత్ర ఈ ఒక్కరోజుతో ఆగిపోదు. రైతుల నుంచి ప్రతి గింజ కొనేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. రైతుకు న్యాయం చేసే వరకు ఈ రైతు పోరుబాట పాదయాత్ర కొనసాగుతుంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేసే వరకు టీడీపీ పోరాటం ఆపే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం నుంచి రైతు పోరుబాట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా మార్గమధ్యంలో రోడ్లపై కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. రైతుల నుంచి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామంటూ చంద్రబాబు నాయుడు ఎదుట రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతులను ఓదారుస్తూ చంద్రబాబు నాయుడు పాదయాత్ర కొనసాగుతుంది.

రైతులను ఓదార్చే తీరిక లేదా?

రాష్ట్రంలో ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. తడిసిన ధాన్యాన్ని సైతం కనుగోలు చేయాలని.. రైతుకు ప్రభుత్వం అండగా ఉండేవరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని వెల్లడించారు. రైతులకు న్యాయం చేయాలని తాను 78 గంటలు అల్టిమేటం ఇచ్చినా వైసీపీ ప్రభుత్వం మెుద్దు నిద్ర వీడటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రైతుల జీవితాలతో ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది అని మండిపడ్డారు. నిర్లక్ష్యపు ధోరణితో రైతుల జీవితాలను జగన్ సర్కార్ నట్టేట ముంచుతుందని రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని చంద్రబాబు విమర్శించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి సీఎం వైఎస్ జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలతో రైతులు కుదేలైతే వారిని పరామర్శించేందుకు సీఎం జగన్‌కు గానీ మంత్రులకు ప్రజాప్రతినిధులకు తీరిక లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. కౌలు రైతులను ఓదార్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. కరోనా సమయంలో కూడా కరోనాకు బయటపడకుండా దేశానికి అన్నం పెట్టిన రైతులు దిక్కులేని స్థితిలో ఉంటే వారిని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని చంద్రబాబు నాయుడు నిలదీశారు. తాను వచ్చి రైతులకు భరోసా ఇస్తుంటే వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నారు అని విరుచుకుపడ్డారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చరిత్ర హీనులవుతారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


మంత్రిని బర్తరఫ్ చేయాలి

అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే వారిని కష్టకాలంలో భరోసా కల్పించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరితే మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అని మండిపడ్డారు. ఎర్రిపప్ప అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తారా అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అంటే ఎందుకంత లెక్కలేనితనం అని ధ్వజమెత్తారు. రైతులపట్ల అంత దురుసుగా వ్యవహరించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు మంత్రిపై ఇప్పటి వరకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణమే మంత్రిని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రిపప్ప' అంటూ హేళన చేసింది కాకుండా ఎర్రిపప్ప అంటే బుజ్జినాన్న అంటూ కొత్త అర్థం చెప్తారా అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావుపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


బెదిరిపోవాల్సిన అవసరం లేదు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి న్యాయం చేస్తామని తెలిపారు. రైతులు ఎలాంటి భయాందోళన చెందొద్దని సూచించారు. పంట నష్టంతో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు. అంతా కలిసి ఈ సైకో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మెడకు ఉరితాడు బిగిద్దాం అని చెప్పుకొచ్చారు. అప్పుడే మన బతుకులు ఆఫీసులు మారతాయని చెప్పుకొచ్చారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయాల్సిందేని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో భాగంగా రైతులు మార్గమధ్యంలో రోడ్ల మీద, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అయితే వారిపట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమ పంట నష్టంపై తెలియజేస్తే అడ్డుకుంటారా అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Also Read.

రైతు బాంధవులుగా పవన్, చంద్రబాబులు వేషాలు వేస్తున్నారు : సీఎం వైఎస్ జగన్



Next Story