చింతపల్లి ఏజెన్సీలో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం.. పలువురు గల్లంతు

by srinivas |   ( Updated:2024-09-09 04:31:59.0  )
చింతపల్లి ఏజెన్సీలో కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం.. పలువురు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు (Heavy Rains) ప్రజలను వణికిస్తున్నాయి. రెండు రోజులుగా చింతపల్లి, రంపచోడవరం ఏజెన్సీల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, దేవీపట్నం, రామవరం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వాగు నీరు భారీగా చేరడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.

మరోవైపు భారీ వర్షాలతో జీకే వీధి మండలం చట్రాయపల్లిలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. దీంతో చాలా ఇళ్ల ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. మరో నలుగురిని గ్రామస్తులు రక్షించారు. చింతూరు డివిజన్‌లో (Chintoor Division) అన్ని ఘాట్ రోడ్లలో రాకపోకలను నిషేధించారు. సీలేరు ఘాట్ (Seeleru Ghat) రోడ్‌లోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో సూచించారు.

Advertisement

Next Story

Most Viewed