గ్రామ సచివాలయాలతో గాంధీజీ కలలు సాకారం.. మంత్రి గుమ్మనూరు

by Dishafeatures2 |
గ్రామ సచివాలయాలతో గాంధీజీ కలలు సాకారం.. మంత్రి గుమ్మనూరు
X

దిశ, ఆలూరు: గ్రామ సచివాలయాలతో గాంధీజీ కన్న కలలు సాకారం అవుతున్నాయని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం చిప్పగిరి మండలం దౌల్తాపురం గ్రామంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సర్పంచ్ లక్ష్మి దేవమ్మతో కలిసి మంత్రి రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే చిప్పగిరి మండలం దౌల్తాపురం పంచాయతీ పరిధిలోనే దాదాపు 14 కోట్ల 77 లక్షల రూపాయలక అభివృద్ధి పను చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.

నంచర్ల గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో తాగునీటి పైప్ లైన్ లకు ప్రణాళికలు సిద్ధి చేయాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, చిప్పగిరి మండల కన్వీనర్ గుమ్మనూరు నారాయణ, చిప్పగిరి సర్పంచ్ గోవింద్ రాజులు,వైస్సార్సీపీ నాయకులు మల్లికార్జున, మాజీ సర్పంచ్ శేఖర్,రాజన్న,రంగస్వామి శ్రీధర్, గుంతకల్లు సూర్య,తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో సుధాకర్ రాజు, దౌల్తాపురం సర్పంచ్ లక్ష్మీ దేవమ్మ, నంచర్ల సర్పంచ్ బీమా, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed