Atmakur: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

by srinivas |
Atmakur: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
X

దిశ, ఆత్మకూరు: అప్పుల బాధతో కౌలు రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం అమలాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మన్న (42) అనే రైతు ఐదున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ కుటుంబ జీవనం సాగించారు. సాగు కోసం దాదాపు రూ.12లక్షలు అప్పు చేశారు. సకాలంలో వర్షాలు కురవక పంటలు ఎండిపోయాయి. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్థాపం చెందిన యువ రైతు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటిదిక్కు తాడుకు విగత జీవిగా వేలాడుతుండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భార్య మల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed