- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
చంద్రబాబుకు బెయిల్.. ఆత్మకూరులో టీడీపీ శ్రేణుల సంబరాలు

దిశ, ఆత్మకూరు: వైసీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడం పట్ల టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆత్మకూరు గౌడ్ సెంటర్ నందు టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయించిన చంద్రబాబుపై అవినీతి మరక వేయలేరని పేర్కొన్నారు. తమ అధినేత చంద్రబాబు 29 నుంచి పులిలా ప్రజల్లోకి వస్తారని నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందన్న ఆనందం కంటే 50 రోజులకు పైగా అన్యాయంగా జైల్లో నిర్బంధించారనే బాధే ఎక్కువగా ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేకే పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపే యత్నం చేసి.. వైసీపీ సర్కారు కంగు తినిందంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధినేత చంద్రబాబు పూర్తి స్థాయి కార్యక్రమాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ లోపు మిగిలిన కేసుల్లోనూ బెయిల్ వస్తుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో ఇక జగన్ మోహన్ రెడ్డిపై పోరుబాటను ఉధృతం చేస్తామని చెప్పారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.