Srisalam: ఆలయ క్యూలైన్‌లోకి దుర్గంధపు నీరు... భక్తుల తీవ్ర ఇబ్బందులు

by Disha Web Desk 16 |
Srisalam: ఆలయ క్యూలైన్‌లోకి దుర్గంధపు నీరు... భక్తుల తీవ్ర ఇబ్బందులు
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానంలో అభిషేక సేవ కర్తలు ప్రవేశించే ఆలయ క్యూలైన్‌లోకి దుర్గంధపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆ ప్రాంతమంతా భరించలేని వాసన వెదజల్లుతోంది. అక్కడున్న భక్తులు, సేవకుల ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. శ్రీశైలంలో ఈ నెల 19వ తేది నుంచి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

అయితే అభిషేక సేవ కర్తలు, వీఐపీ బ్రేక్ రూ. 5 వేలు, 1,500, రూ.500 ల టికెట్ల దర్శనం భక్తులు ఆలయంలోకి ప్రవేశించే క్యూ లైన్ ఎదురుగా టాయిలెట్స్, ఆర్సీసీ ట్యాంక్ ఉంది. టాయిలెట్స్ శుభ్రం చేసిన నీరు ట్యాంకు వద్ద భక్తులు కాళ్లు, చేతులు కడిగిన నీటితో డ్రైనేజ్ నిండిపోయింది. అయితే ఈ దుర్గంధపు నీరు క్యూలైన్ మార్గంలోకి వెళ్తోంది. దీంతో భక్తులు ఆ దుర్గంధపు నీటిని తొక్కుకుంటూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. అధికారులు స్పందించి క్యూ లైన్‌లోకి దుర్గంధపు నీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


Next Story