Srisailam: మహాక్షేత్రంలో మహాకుంభాభిషేకం వాయిదా

by Disha Web Desk 16 |
Srisailam: మహాక్షేత్రంలో  మహాకుంభాభిషేకం వాయిదా
X

దిశ, శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 25 నుంచి 31 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. అయితే వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందనే అంచనాతో భక్తులు ఎక్కువగారారని, 25 నుంచి 31 వరకు జరగనున్న మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు దేవాదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ప్రకటన ద్వారా తెలిపారు.


అయితే శ్రీశైలం దేవస్థానం అధికారులు ఇప్పటికే క్షేత్రంలో మహా కుంభాభిషేక వాతావరణాన్ని తీసుకొచ్చారు. గత 25 రోజులుగా అన్ని విభాగాల అధికారులు కసరత్తు చేసి దాదాపు 80 శాతం పనులు పూర్తి చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్షేత్రంలో ఉన్న ప్రధానాలయం, పరివార ఆలయాల గోపురాలు అన్నిటికి కూడా పరంజాలు కట్టి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే మహాకుంభాభిషేకానికి రాష్ట్రంలోని ప్రముఖులకు రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు కూడా దేవస్థానం అధికారులు అందజేశారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుండి 17 వరకు నిర్వహించిన సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం కార్యక్రమానికి వేసవి వడగాల్పులు వల్ల భక్తులు, వృద్ధులు, పిల్లలు పాల్గొనలేకపోయారని ఈ అనుభవం దృష్ట్యా ఈనెల 25 నుండి 31వ తేదీ వరకు శ్రీశైలం మహా క్షేత్రంలో నిర్వహించవలసిన మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని పండితులతో సంప్రదించి వారి సూచనల మేరకు పవిత్రమైన కార్తీకమాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రాము సత్యనారాయణ ప్రకటన ద్వారా తెలిపారు.



Next Story

Most Viewed