జలాదివాసం వీడుతున్న సంగమేశ్వరుడు

by srinivas |
జలాదివాసం వీడుతున్న సంగమేశ్వరుడు
X

దిశ, కర్నూలు: నల్లమల అభయారణ్య ప్రాంతంలో వెలసిన సప్తనదుల సంగమేశ్వర ఆలయం క్రమంగా జలాదివాసం వీడుతోంది. ప్రతి ఏడాదిలో 8 నెలలు జల దిగ్భందంలో, 4 నెలలు ప్రజలకు దర్శనమిచ్చే అరుదైన దేవాలయం ఈ ప్రాంతం సొంతం. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సప్తనదుల సంగమ తీరంలో వెలసిన ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 863 అడుగులకు చేరుకుంది. నీటి సామర్థ్యం 840 అడుగులు చేరుకుంటే ఆలయం పూర్తి స్థాయిలో బయట పడుతుంది. ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినానికి ముందే ప్రజలకు దర్శనం ఇచ్చేది. మరో 24 అడుగుల నీరు తగ్గితే ఆలయం పూర్తిగా కృష్ణమ్మను వీడుతుంది.


ప్రస్తుతం ఆలయ శిఖరం బయట పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా జిల్లాలకు చెందిన భక్తులు, పర్యాటకులు ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు బారులు తీరుతున్నారు. తెలంగాణకు చెందిన భక్తులు మర బోట్ల ద్వారా ఆలయాన్ని తిలకించేందుకు వస్తున్నారు.

Next Story

Most Viewed