TG Venkatesh: జర్నలిస్టులకు అండగా ఉంటా

by srinivas |
TG Venkatesh: జర్నలిస్టులకు అండగా ఉంటా
X

దిశ, కర్నూలు ప్రతినిధి: జగన్నాథగట్టులో స్థలాలున్న జర్నలిస్టులందరికీ అండగా ఉంటామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ.వెంకటేష్ భరోసానిచ్చారు. మౌర్యఇన్‌ ఛాంబర్‌లో ఆయనను వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు కలిశారు. తమ స్థలాల్లో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆయనకు వివరించారు. అక్రమ తవ్వకాల వల్ల 60 మంది జర్నలిస్టుల ప్లాట్ల రూపురేఖలు మారిపోయాయని, నిర్మాణానికి పనికి రాకుండా పోయాయని, తమకు సహకరించాలని కోరారు.

అందుకు ఆయన స్పందిస్తూ జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో జరుగుతున్న తవ్వకాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రధానంగా మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే జర్నలిస్టులు చేసే పోరాటాలకు కూడా తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని టీజీ వెంకటేశ్ హామిచ్చారు.

Next Story