విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కర్నూలులో ఆందోళనలు

by Disha Web Desk 16 |
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కర్నూలులో ఆందోళనలు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కర్నూలు సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీఎస్.రాధాకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్పలు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ కోసం 700 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న వారికి మద్దతుగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బీజేపీ ప్రభుత్వం దొడ్డిదారిన బలహీనపరచడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగా ప్లాంటుకు గుండెకాయలాంటి బ్లాస్ట్ పర్నేష్-3ను 14 నెలలుగా మూసివేసి ఉత్పత్తిని తగ్గించిందని చెప్పారు. తద్వారా నష్టాల్లో ఉందని సాకు చూపి దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన ప్లాంట్‌ను కేవలం రూ.30 వేల కోట్లకు కొరియాకు కట్టబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి మోదీకి గుణపాఠం చెప్పేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed