సీఎం జగన్ రైతుల పాలిట శనిగ్రహం: Nara Lokesh

by srinivas |
సీఎం జగన్ రైతుల పాలిట శనిగ్రహం: Nara Lokesh
X

దిశ, నంద్యాల : రైతుల పాలిట జగన్ శనిలా మారారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నంద్యాల యువగళం పాదయాత్రలో భాగంగా ప్రజలను లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ సీమ రైతులకు నీరు అందిస్తే బంగారం పండిస్తారని, రాయలసీమలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాతావరణంపై నెపం వేసి జగన్ అసమర్థతను కప్పిపెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు.

అయితే అంతకుముందు లోకేష్ కుడి చేతి భుజం ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్టును వైద్యులు పరిశీలించారు. స్కానింగ్ రిపోర్టులో భుజానికి పెద్ద ప్రమాదం లేదని తెలిపారు. తీవ్రమైన భుజం నొప్పి కారణంగా ఉదయం లోకేష్ ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ తీయించుకున్నారు. కాసేపటి క్రితమే ఎంఆర్‌ఐ స్కానింగ్ రిపోర్టులు రావడంతో వాటిని వైద్యులు పరిశీలించారు. స్కానింగ్ రిపోర్టులో భుజానికి పెద్ద ప్రమాదం లేదని తెలిపారు. ఫిజియోధెరఫీ, ఐస్ ప్యాక్, హీట్ ప్యాక్, మెడిసిన్ వాడితే భుజం గాయం మానుతుందని వైద్యులు తెలియజేశారు.

Next Story