Dhone: ఓటర్ల జాబితాలో అవకతవకలు..జేసీకి బీజేపీ ఫిర్యాదు

by Disha Web Desk 16 |
Dhone: ఓటర్ల జాబితాలో అవకతవకలు..జేసీకి బీజేపీ ఫిర్యాదు
X

దిశ, డోన్: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాపై నంద్యాల జిల్లా బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యాకరమైన ఓటరు జాబితా తయారు చేయడంలో ఎలక్ట్రోల్ అధికారి, బీఎల్‌లో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. ఇప్పటికైనా సరైన ఓటర్ల జాబితా తయారు చేయాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ తాటిమక్కుల రాహుల్ కుమార్ రెడ్డికి మెమోరాండం సమర్పించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి వడ్డే మహారాజ్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కేసీ మద్దిలేటి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రాఘవేంద్ర ఆచారి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు భరణి రమేష్ మీడియాతో మాట్లాడారు. బీఎల్వోలుగా ఉన్నా సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు నకిలీ ఓట్లు చేర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఓట్లు, డబుల్ ఎంట్రీ‌లు తీసివేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని తెలిపారు. ప్యాపిలి మండలం గుట్టలపల్లి ప్రజలు సుమారు ఆరు కిలోమీటర్లు నడచి ఓటు వేసే పరిస్థితి ఉందని, స్థానికంగా కొత్త పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Read More..

బీజేపీ ప్రభుత్వం తోనే పేదలకు సంక్షేమం : తోకల శ్రీనివాస్ రెడ్డి
















Next Story