అజ్ఙాతంలోకి మంత్రి జయరాం.. కారణం అదేనట..!

by Disha Web Desk 16 |
అజ్ఙాతంలోకి మంత్రి జయరాం.. కారణం అదేనట..!
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎవరు ఫోన్ చేసినా స్పందించడంలేదట. దీనంతటికి కారణం కర్నూలు ఎంపీగా పోటీ చేయడం ఆయనకు ఇష్టంలేదని అనుచరులు అంటున్నారు. అందుకే ఆయన ఎవరికీ అందుబాటులో లేరట. ఇటీవల మంత్రి జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి జయరాం నాలుగు రోజులు పాటు బెంగళూరులో ఉన్నారు. ఆ తర్వాత ఆలూరులో మూడు రోజులు సొంత నివాసంలో అందుబాటులో ఉన్నారు. ప్రజలను కలిశారు. అభిప్రాయాలను తీసుకున్నారు. కానీ శుక్రవారం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేరట. మంత్రి జయరాంను ఆలూరు ఇంచార్జి విరూపాక్షి కలిసేందుకు శుక్రవారం సాయంత్రం ప్రయత్నించారట. కానీ ఆయనతో కూడా కలవలేదట. అసలు జయరాం అందుబాటులోనే లేరట. దీంతో విరూపాక్షి మంత్రి జయరాంను కలవకుండానే వెళ్లిపోయారు. అయితే ఎంపీగా పోటీ చేయడం ఇష్టంలేకనే మంత్రి జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది.

అటు కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి జయరాంను నియమించినప్పుడు కూడా జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అప్పుడే అయిపోలేదని చివరి నిమిషంలో కూడా అభ్యర్థులు మారొచ్చని వ్యాఖ్యానించారు. కానీ జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలిపారు. నియోజకవర్గ అభ్యర్థులు ఓకే అంటే కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. కానీ తాను ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది నియోజకవర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలు నిర్ణయం మేరకే ఉంటుందని తెలిపారు. ఇంత చెప్పిన ఆయన సడెన్‌గా అజ్ఞాతంలోకి వెళ్లడంపై పార్టీ శ్రేణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జయరాం త్వరగా అందుబాటులోకి రావాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read More..

విశాఖ ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం.. నిర్లక్ష్యం చేయడం బాధాకరం..

Next Story

Most Viewed