స్టీల్ ప్లాంట్ పనులు త్వరగా పూర్తి చేయాలి: Minister Buggana

by srinivas |
స్టీల్ ప్లాంట్ పనులు త్వరగా పూర్తి చేయాలి: Minister Buggana
X

దిశ, కర్నూలు ప్రతినిధి: జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ ప్రతినిధులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదేశించారు. ఓర్వకల్ మండలం గుట్టపాడు గ్రామంలో నిర్మిస్తున్న జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పనుల పురోగతిపై కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ జి.సృజన, ఇండస్ట్రీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత యాజమాన్యంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీక్షించి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించిన పురోగతి నెమ్మదిగా ఉందని, వేగవంతం చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ వేయించాలని కోరారు. అటు నీటి సమస్యను కూడా పరిష్కరించాలని, స్ట్రీట్ లైటింగ్ వేయించాలని మంత్రికి వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి బుగ్గన ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అదేవిధంగా పనులు పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని మంత్రి బుగ్గన సూచించారు.

Next Story

Most Viewed