- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
MRPS: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించండి.. ఎమ్మార్పీఎస్ డిమాండ్

దిశ, ఎమ్మిగనూరు: ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తొమ్మిదిరోజులుగా ఎమ్మిగనూరులో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి జి. ఆనంద్ చైతన్య మాదిగ మాట్లాడుతూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇక తొమ్మిదవ రోజు దీక్షలో మాదిగ విద్యార్థి సమాఖ్య (యం యస్ ఫ్) నాయకులు గిరిపోగు దివాకర్ చైతన్య మాదిగ, బంగారప్ప మాదిగ, మడ్రి ఆదిత్య మాదిగ, జీవన్ రావు మాదిగ, తారక్ బాబు మాదిగ పాల్గొన్నారు. ఈ దీక్షలకు పి.డి.ఎస్.యు. రాష్ట్ర కార్యదర్శి రాజేష్, యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఉదయ్, మల్లెల గ్రూప్ సభ్యులు అజిత్, గోల్డ్ షాప్ జావేద్, మాల మహానాడు నాయకులు మాల సత్యనారాయణ తదితరులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.