Big Breaking: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం

by Disha Web Desk 16 |
Big Breaking: ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం
X

దిశ అలంపూరు/ఇటిక్యాల: ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నీరజారెడ్డి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు వెనుక టైరు గద్వాల జిల్లా బీచుపల్లి దగ్గర పేలి ఒక్కసారి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నీరాజారెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదంలో నీరజారెడ్డి తల, ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలపాలయ్యారు. అంతేకాదు ప్రమాదం ధాటికి వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో వెంటనే నీరజ రెడ్డిని కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే 1996లో నీరజా రెడ్డి భర్త దారుణహత్యకు గురయ్యారు.భర్త దారుణ హత్య అనంతరం నీరజారెడ్డి రాజకీయారంగేట్రం చేశారు. ఈ క్రమంలో 2004లో కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2009లో కాంగ్రెస్ టికెట్‌పై ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన నీరజా రెడ్డి ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

వైసీపీ నుంచి బీజేపీలోకి నీరజారెడ్డి


కాగా నీరజారెడ్డి 2009లో కాంగ్రెస్ నుంచి ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు జరగడంలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2019లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ నాయకురాలిగా నియోజకవర్గంలో సేవలు అందిస్తున్నారు.

బీజేపీ నాయకుల దిగ్భ్రాంతి

ఇక నీరజారెడ్డి మరణ వార్త విన్న బీజేపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

ఇవి కూడా చదవండి : Chittoor: మహిళను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఘోరం.. నలుగురు దుర్మరణం



Next Story

Most Viewed