లగ్జరీ బస్సులో '' డైన్ ఆన్ బస్'' రెస్టారెంట్

by Disha Web Desk 4 |
లగ్జరీ బస్సులో  డైన్ ఆన్ బస్ రెస్టారెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా బిజినెస్ చెయ్యాలంటే పెట్టుబడి ఉంటే సరిపోదు. కస్టమర్స్‌ని ఆకట్టుకునే తెలివి కూడా ఉండాలి. అప్పుడే వ్యాపారం ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోతుంది. అలాంటి వినూత్న ఆలోచనతో ముగ్గురు స్నేహితులు స్టార్ట్ చేసిందే ఈ ''డైన్ ఆన్ బస్'' రెస్టారెంట్. కర్నూలుకి చెందిన ముగ్గురు స్నేహితులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు 'థీమ్ బెస్ట్ రెస్టారెంట్'ల బాట పట్టారు. దీని కోసం ఓ పాతపడ్డ ప్రైవేట్ సూపర్ లగ్జరీ బస్సును కొనుగోలు చేసి.. అందులో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. దానికి 'డైన్ ఆన్ బస్' అని పేరు పెట్టారు. బస్సు సీట్లను తొలగించి 16 మంది కూర్చునేలా అరేంజ్మెంట్స్ చేసి బస్ రెస్టారెంట్ ను అందుబాటులోకి తెచ్చారు. రాత్రి సమయంలో చల్లని గాలిలో హాయిగా సేదతీరుతూ నచ్చిన ఆహారం తినే అవకాశం ఉండటంతో కస్టమర్స్‌ క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ రెస్టారెంట్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed