kurnool: 24న రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆందోళన

by Disha Web Desk 16 |
kurnool: 24న రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆందోళన
X

దిశ, కర్నూలు అర్బన్: కార్మికుల సమస్యలు పరిష్కారానికి వివిధ దశల్లో ఆందోళనలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.అంజిబాబు పిలుపునిచ్చారు. కర్నూలు కార్మిక కర్షక భవన్‌లో సోమవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. ఈఎస్ఐ హాస్పిటల్స్‌ను కేంద్ర ప్రభుత్వ ఈఎస్ఐ సంస్థ ఆధీనంలోకి తీసుకొనడానికి వ్యతిరేకంగా ఈనెల 24న ఆందోళన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలో చాలా మందికి ఈఎస్ఐ సౌకర్యం అందుబాటులో లేదని కేంద్ర ప్రభుత్వ అజమాయేసిలోకి వెళితే ఈఎస్ఐ సౌకర్యం పొందుతున్న వాళ్లకి సేవలు అందడం ఆలస్యం అవుతుందని ఆయన అన్నారు.

జూన్ 14న ప్రపంచ రక్త దాన దినం సందర్భంగా కర్నూలు, ఆదోని సెంటర్‌లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రయాణిస్తూ జూన్ 9వ తేదీన విజయవాడలో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు హిందూపురంలో ప్రారంభమైన మున్సిపల్ జాత జూన్ 1వ తేదీన ఆదోని ఎమ్మిగనూరు, గూడూరులోనూ రెండవ తేదీన కర్నూల్‌లోనూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రాబోవు కాలంలో అన్ని ట్రేడ్ యూనియన్లను కలుపుకొని పెద్ద ఎత్తున మహా పడవ్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలియజేశారు.


Next Story

Most Viewed