Breaking: నామినేషన్ల వేళ టీడీపీ అభ్యర్థికి షాక్

by Disha Web Desk 16 |
Breaking: నామినేషన్ల వేళ టీడీపీ అభ్యర్థికి షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నియోజకవర్గాలో కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అభ్యర్థులకు సహకరించడంలేదు. నామినేషన్ల దాఖలు చేస్తున్న సమయంలోనూ అడ్డంతిరుగుతున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డికి టికెట్ దక్కింది. దీంతో ఆయన గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీజేపీ, జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీవీ జయనాగేశ్వరరావు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరుకాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు సహకరించమని చెబుతున్నారు. అంతేకాదు తాము కూడా నామినేషన్లు దాఖలు చేస్తామని చెబుతున్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తామని కమలం పార్టీ ఇంచార్జి మురహరి రెడ్డి ప్రకటించారు.

దీంతో టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. కూటమిలో భాగంగానే తమ నేత బీవీ జయనాగేశ్వరరెడ్డికి టికెట్ దక్కిందని.. ఇప్పుడు బీజేపీ, జనసేన నేతలు రివర్స్ కావడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఈ పరిణామంతో ఎమ్మిగనూరు ఎన్డీయే కూటమిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ఈ పంచాయితీ ఎలా కొలిక్కి వస్తుందో చూడాలి.

Next Story

Most Viewed