Kurnool: పొంచి ఉన్న ప్రమాదం... భయాందోళనలో ప్రజలు

by Disha Web |
Kurnool: పొంచి ఉన్న ప్రమాదం... భయాందోళనలో ప్రజలు
X

దిశ, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మండలం బినాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల సమీపంలో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ ఉండడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటరు, ఆరోగ్య ఉప కేంద్రాలకు ఎదురుగా ఉన్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి రాసుకుంటూ కిందికి వేలాడుతున్నాయి. పేరూరు గ్రామస్తులు ఆరోగ్య కేంద్రానికి, విద్యార్థులు, అంగన్వాడి చిన్నారులు నిత్యం తిరుగుతూ ఉంటారు. విద్యుత్ తీగలు రహదారికి అడ్డంగా కిందికి వేలాడుతూ ఉండడంతో ఎప్పుడు ప్రమాదంలో జరుగుతుందో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ తీగలను పైకి లాగి ప్రత్యేక స్తంభాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు విద్యుత్ అధికారులకు గ్రామస్థులు చెప్పినా పరిష్కరించలేదని, అధికారులు తమ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని చెబుతున్నారు. చేసేదేమీ లేక విద్యుత్ తీగలను తాత్కాలికంగా వెదురు బొంగుతో పైకి ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.


Next Story