త్వరలో ఆ సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేస్తా: Bhuma Akhila Priya

by Disha Web Desk 16 |
త్వరలో ఆ సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేస్తా: Bhuma Akhila Priya
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో, దేశంలో ఎక్కడా జరగని సంఘటన నంద్యాలలో చోటు చేసుకుందని మాజీమంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆడపిల్లపై దాడి చేసి కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యయత్నం కేసులో ఆమె ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెకు కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దీంతో అఖిల ప్రియ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆమె సంతకం చేశారు.

ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న సంస్కృతి తాను వినలేదని, చూడలేదన్నారు. రాష్ట్రాల్లో ఉన్న మహిళల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేసు పెట్టడమే కాకుండా, పెట్టించడానికి యత్నించిన వారి ఇళ్లలోని ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని తాను కోరుకుంటున్నానని భూమా అఖిలప్రియ తెలిపారు. నంద్యాలలో జరిగిన దాడికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని త్వరలోనే విడుదల చేస్తానని భూమా అఖిలప్రియ వెల్లడించారు.

Next Story

Most Viewed