- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Kurnool: 30న పత్తికొండకు సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం

దిశ, కర్నూలు ప్రతినిధి: రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏపీ సీఎం ఈ నెల 30న కర్నూలు జిల్లా పత్తికొండకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చేపట్టిన సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం డీఐజీ జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యటన సందర్భంగా హెలిఫ్యాడ్, పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు వచ్చే ముఖ్యమైన రహదారులను, రూట్ బందోబస్తులను పరిశీలించారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.