చికెన్ షాప్‌లో పనిచేస్తూనే కాలేజీ టాపర్‌గా నిలిచిన ప్రభుత్వ కళాశాల విద్యార్థి..

by Disha Web Desk 9 |
చికెన్ షాప్‌లో పనిచేస్తూనే కాలేజీ టాపర్‌గా నిలిచిన ప్రభుత్వ కళాశాల విద్యార్థి..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి వ్యక్తికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. కానీ పలు కారణాల చేత తమ లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. కొంతమంది మాత్రం అనుకున్న లక్ష్యం చేరేవరకు ఎన్ని కష్టాలొచ్చినా గమ్యాన్ని చేరుకుంటారు. రీసెంట్‌గా ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి.. నిన్న రిలీజైన ఫలితాల్లో రికార్డు సృష్టించాడు. వివరాల్లోకెళ్తే.. కర్నూల్ జిల్లాకు చెందిన జావీద్ అనే విద్యార్థి చదువుకుంటూనే కర్నూల్‌లోనే చికెన్ షాప్ నిర్వహిస్తూ తమ్ముడిని చదివించాడు. తల్లిదండ్రులు కర్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. జావీద్ చికెన్ షాపులోనే ఉంటూ 10 వ తరగతిలో 520 మార్కులు సాధించాడు. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో 1000 కి 961 మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు సాధించానని చెప్పుకొచ్చాడు. రాత్రింబవళ్లు కష్టపడుతూ.. మంచి మార్కులు తెచ్చుకోవడంతో జావీద్ తల్లిదండ్రులు హర్హం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed