- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి అమ్మవారి కుంభోత్సవం

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం(Srisailam)లో కొలువుదీరిన భ్రమరాంబికాదేవి అమ్మవారి వార్షిక కుంభోత్సవం నేడు(మంగళవారం) ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే దేవస్థానం ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇవాళ(మంగళవారం) ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారికి అన్నాభిషేకం చేయనున్నారు. అనంతరం భక్తుల(Devotees)కు అమ్మవారి నిజరూప దర్శనం కల్పిస్తారు.
ఈ క్రమంలో ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు భ్రమరాంబికా దేవి అమ్మవారి కుంభోత్సవం ఘనంగా నిర్వహించాలని అర్చకులకు, ఆలయ అధికారులకు తెలిపారు. అమ్మవారి కుంభోత్సవం అనంతరం.. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తారని తెలిపారు. ఈ తరుణంలో క్యూలైన్లలో తొక్కిసలాట జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలం సీఐ జి. ప్రసాదరావు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. నిన్న(సోమవారం) సాయంత్రం శ్రీశైలం క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను ఘనంగా నిర్వహించారు.