సోది ఆపి కొవ్వు కరిగించే పనిలో ఉండు.. కేశినేనికి పీవీపీ కౌంటర్

by srinivas |
సోది ఆపి కొవ్వు కరిగించే పనిలో ఉండు.. కేశినేనికి పీవీపీ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా అయినా గెలుస్తానంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, పీవీపీ సంస్థల అధినేత పీవీపీ కౌంటర్ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజుకి ఎక్కువ, నేతాజికి తక్కువ అన్నట్టు బిల్డప్ ఏందయ్యో అంటూ కేశినేని నానిపై ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దొబ్బేది బ్యాంకులని, జీతాల ఎగ్గొట్టేవి కార్మికులవి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. సోది ఆపి కొవ్వు కరిగించే పనిలో ఉండాలంటూ సెటైర్లు వేశారు.

గత ఎన్నికల్లో కేశినేని నానిపై పీవీపీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా అటురాజకీయాలకు ఇటు వైసీపీ కార్యక్రమాలకు పీవీపీ దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పీవీపీ దూకుడు పెంచారు. కేశినేని నాని వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే మళ్లీ విజయవాడ బరి నుండి పీవీపీ పోటికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

Also Read..

ముందస్తు యోచనలో జగన్.. అక్టోబర్‌లో కేబినెట్ రద్దు..?

చంద్రబాబుపై మరోసారి జగన్ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed