పెనుగంచిప్రోలు తిరునాళ్లలో ఉద్రిక్తత

by srinivas |   ( Updated:2024-03-30 15:50:50.0  )
పెనుగంచిప్రోలు తిరునాళ్లలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపతి తిరునాళ్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో నలుగురికి గాయలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి ఆవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. తిరునాళ్లలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్ల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు పుట్టిళ్లు అనిగండ్లపాడు నుంచి పెనుగంచిప్రోలు వరకు బండ్ల ఉత్సవం సాగింది. ప్రస్తుతం తిరునాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో డీజేలు, పార్టీ జెండాల రంగులపై నిషేధం విధించారు. నందిగామ ఏసీపీ రవి కిరణ్ నేతృత్వంలో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. అయినా సరే తిరునాళ్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed