- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు కన్నుమూత
దిశ, వెబ్ డెస్క్: శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసం బాత్ రూమ్‌లో కాలు జారి పడటంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో బీఎస్ రావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు విజయవాడ తరలించనున్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా 1986లో బీఎస్ రావు శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. యూకే, ఇరాన్‌లో దాదాపు 16 ఏళ్ల పాటు మెడిసిన్ ప్రాక్టీస్ చేసిన డాక్టర్ బీకే రావు 1986లో విజయవాడలో మొట్టమొదటి శ్రీ చైతన్య స్కూలును ప్రారంభించారు. బీఎస్ రావు భార్య లక్ష్మీబాయి కూడా డాక్టర్ చదివారు. ఇద్దరి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల శ్రీ చైతన్య విద్యాసంస్థలను నెలకొల్పారు.
1991లో హైదరాబాద్‌లో బాలుర జూనియర్ కాలేజీని స్థాపించారు. ఏపీ, తెలంగాణలో 321 ఇంటర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, ఇతర రాష్ట్రాల్లో 107 సీబీఎఈ అనుబంధ పాఠశాలలను స్థాపించారు. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ పేరుతో బీఎస్ రావు విద్యా సంస్థలు స్థాపించి సేవలు అందించారు. ఆయన మరణంతో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.