Bro Flexy: సూపర్ మెసేజ్ ‘బ్రో’.. ఒక్క ఫ్లెక్సీతో అందర్నీ పిండేశావ్ కదయ్యా.. !

by srinivas |   ( Updated:2023-07-29 12:51:23.0  )
Bro Flexy: సూపర్ మెసేజ్ ‘బ్రో’.. ఒక్క ఫ్లెక్సీతో అందర్నీ పిండేశావ్ కదయ్యా.. !
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా విడుదల అయింది. మూవీ మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డుతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అటు ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఒకటికి రెండు సార్లు మూవీని చూస్తున్నారు. ఈ మూవీలో పవన్, సాయిధరమ్ తేజ్ చేసిన నటనకు అటు అభిమానుల నుంచే కాదు సాధారణ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. మామ అల్లుళ్లు చించేశారని అంటున్నారు.


అయితే కృష్ణా జిల్లా కైకలూరులో మాత్రం ‘బ్రో’ సినిమా ఫెక్సీ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఓపెన్ చేసిన పవన్ కల్యాణ్ తొలి పోస్టుతోనే అందరి హీరోల ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. టాలివుడ్ అగ్ర హీరోలందరంటే తనకు ఇష్టమని, వారి వల్ల ఇండస్ట్రీలో చాలా మందికి జీవనోపాధి దొరుకుతోందని పోస్ట్ చేశారు. దీంతో అందరి ఫ్యాన్స్ నుంచి కూడా పవన్ కల్యాణ్‌కు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.


దీంతో జనసేన పార్టీ చెందిన కార్యకర్త, పవన్ అభిమాని కొల్లి వరప్రసాద్ పవన్ కల్యాణ్ బాటలోనే నడిచారు. టాలీవుడ్ అగ్ర నేతలతో పాటు కోలీవుడ్ హీరో సూర్య ఫొటోను కూడా జత చేసి ‘బ్రో’మూవీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ‘మీరు మేము వేరుకాదు. మనందరం ఒక్కటే. మన సమస్యలు ఒక్కటే. మన సమస్యల పరిష్కరించాలంటే మన రాస్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈసారి జనసేనా పార్టీ వైపు నిలబడండి.. గ్లాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయండి.’ అని ఫ్లెక్సీలో రాశారు. దీంతో అందరి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘బ్రో’నువ్వు సూపర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed