- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
166 మంది ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు.. సీఎం చేతుల మీదుగా అందజేత
దిశ, వెబ్ డెస్క్: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధ్యాపకులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుతో పాటు మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. దేశ ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, దేశ ప్రధమ విద్యా శాఖ మంత్రి మౌలానా ఆజాద్‌లు విద్యారంగానికి చేసిన సేవలను స్మరించుకున్నాన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులను ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దే బృహత్ బాధ్యత గురువులపై ఉందని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థుల్లో నైతిక వర్తన అలవరిచేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా నియమించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
లోకేశ్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులకు ఇచ్చే పురస్కారాల ప్రదానోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించామన్నారు. రాష్ట్రస్థాయి కమిటీ ద్వారా ఎంపికైన 166 మంది ఉత్తమ అధ్యాపకులకు సీఎం, తాను అవార్డులు ప్రదానం చేశామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి మెరిట్ సర్టిఫికెట్, మెడల్, జ్ఞాపిక, 20వేల రూపాయల నగదు బహుమతి అందజేశామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.