Ap News: ప్రయాణికులపై భారం.. 16 బస్సులు సీజ్

by srinivas |
Ap News: ప్రయాణికులపై భారం.. 16 బస్సులు సీజ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ప్రైవేటు బస్సుల(Private Buses)పై అధికారులు కొరడా ఝులిపించారు. దసరా పండగ(Dussehra festival) సందర్భంగా ప్రయాణికుల(Passengers)పై భారం మోపిన ట్రావెల్స్‌పై చర్యలు తీసుకున్నారు. విజయవాడ(Vijayawada)లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 16 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. అధిక ధరలు వసూలు చేశారని కేసులు నమోదు చేశారు.

కాగా దసరా సందర్భంగా ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రైవేటు బస్సులను భారీగా ఆశ్రయించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళనూరు, విశాఖ వంటి నగరాల నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పల్లెలకు చేరుకున్నారు. అయితే రద్దీ దృష్ట్యా ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు టికెట్స్ ధరలు అమాంతం పెంచారు. పండగకు వెళ్లాలనే ఉద్దేశంతో ధరల భారాన్ని ప్రయాణికులు భరించారు. పలువురు ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు కదిలారు. విజయవాడతో పాటు పలు నగరాల్లో బస్సుల్లో తనిఖీలు చేశారు. టికెట్ ధరల పెంపుపై ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story