Vijayawada: ఆ రిజర్వేషన్లు తెచ్చింది ఎన్టీఆరే: బాలకృష్ణ

by srinivas |
Vijayawada: ఆ రిజర్వేషన్లు తెచ్చింది ఎన్టీఆరే: బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ అసమాన నటుడని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోశారని తెలిపారు. ఏ పాత్రలోకైనా ఎన్టీఆర్ పరకాయ ప్రవేశం చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారని బాలకృష్ణ పేర్కొన్నారు.

‘‘రాజకీయాల్లో ఏన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. రూ.2కే కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లారు. గ్రామ వ్యవస్థలకు ఆయనే శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు.’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Next Story

Most Viewed