Breaking: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-01-29 12:34:15.0  )
Breaking: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఈసారి జరగబోయే ఎన్నికల్లో సీటు రాదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో జగన్ చేయించిన సర్వేలో కృష్ణ ప్రసాద్‌పై నెగిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో మైలవరం నుంచి మరో వ్యక్తిని పోటీ చేయించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్పందించారు. మైలవరంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. తన సీటు విషయంపై తాను క్లారిటీ ఇచ్చేది ఏమీ లేదని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇస్తారని తెలిపారు. సీఎం జగన్ పోటీ చేయమంటే చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి 4,5 తేదీల్లో తన మనోభావాలు చెబుతానని వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

కాగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఐదు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రావడంలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంట్రాక్టర్లు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకరవర్గంలో చేసిన పనుల తాలూకా బిల్లులు కోసం వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు రోజూ తన ఇంటి చుట్టు తిరుగుతున్నారని తెలిపారు. దీంతో వసంత కృష్ణప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన సీటు విషయంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed