ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి సంచలన నిర్ణయం.. ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ప్రకటన

by Disha Web Desk 16 |
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి సంచలన నిర్ణయం.. ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీని వీడబోతున్నారు. ఈ మేరకు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారో సోమవారం ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ ప్రసాద్ తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందిగామ సీటు జనసేన తరపున తంబళ్లపల్లి రమాదేవికి ఇస్తే తాను ఆ పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పారు. తంబళ్లపల్లి రామాదేవి సోమవారం ఆయనను కలిశారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు.


ఈ నేపథ్యంలో ఆయన ఆమెకు సీటు ఇస్తే తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తానని తెలిపారు. నందిగామలో గత రెండుసార్లు టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేశారని.. పొత్తులో భాగంగా ఈసారి రామాదేవికి ఇవ్వాలని ఆయన సూచించారు. నందిగామలో వైసీపీ ఆగడాలు మరింతగా పెరిగాయని వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు.

కాగా ఎన్టీఆర్ జిల్లా వైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. రేపు ఐతవరంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని మీడియా సమావేశం నిర్వహించి తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానని వసంత కృష్ణ ప్రసాద్‌ పేర్కొన్నారు.

కాగా, ఇటీవలే సీఎం జగన్ మైలవరం అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచర వర్గం జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్‌ వైసీపీని వేడేందుకే నిర్ణయించుకున్నారని సమాచారం.



Next Story

Most Viewed