క్రీడాకారుల అవతారమెత్తిన కొడాలి నాని, ఎంపీ బాలశౌరి

by Disha Web Desk 16 |
క్రీడాకారుల అవతారమెత్తిన కొడాలి నాని, ఎంపీ బాలశౌరి
X
  • విద్యార్థులకు చదువు ఒక్కటే ముఖ్యంకాదు
  • క్రీడలు సైతం జీవన విధానంలో భాగం కావాలి
  • - మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీతే ప్రధాన లక్ష్యమని..విద్యార్థులకు చదువు ఒక్కటే ముఖ్యంకాదని, క్రీడలు సైతం జీవన విధానంలో ముఖ్య భాగం కావాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. క్రీడల వల్ల ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తుందని చెప్పుకొచ్చారు. శనివారం ఉదయం కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహణలో జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలు 2022ను మాజీమంత్రి కొడాలి నానితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుందన్నారు. ఆటల్లో ఎవరైతే ఎక్కువగా పాల్గొంటారో వారే అత్యధిక శాతం జీవితంలో రాణిస్తారని ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఎట్టి పరిస్థితుల్లోనైనా తాను విజేత ఆవ్వాలని పట్టుదల క్రీడల ద్వారా బలంగా పెంపొందుతుందని వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నాయన్నారు. రక్షణ రంగం, రైల్వే శాఖ, బ్యాంకులు తదితర సంస్థల్లో స్పోర్ట్స్ కోటా అమలు చేసి క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.



కృష్ణా జిల్లా నుంచి గుడివాడ, మచిలీపట్నం, పెడన, అవినిగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన పలువురు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఏపీ సీఎం 50 లక్షల ప్రైజ్ మనీ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. తొలుత జెండా వందనం చేశారు. అనంతరం పలువురు క్రీడాకారులతో మార్చ్ ఫాస్ట్ స్టేడియంలో నిర్వహించారు. అనంతరం క్రీడాకారులకు ఎంపీ బాలశౌరి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీమంత్రి కొడాలి నానితో కలిసి కాసేపు వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు.


Next Story

Most Viewed