జగన్‌కు ఇదే చివరి ఛాన్స్: పోతిన వెంకట మహేష్

by srinivas |
జగన్‌కు ఇదే చివరి ఛాన్స్: పోతిన వెంకట మహేష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఇదే చివరి అవకాశమని జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఏడవ రోజు ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వం 56వ డివిజన్ డివిజన్ అధ్యక్షులు పిల్లా వంశీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో యర్రకట్ట డౌన్ వద్ద నుంచి ప్రారంభించి ఓల్డ్ ఆర్ ఆర్ పేట, ఉర్దూ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా పోతిన వెంకట మహేశ్ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు.

రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందని ఒక్క అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ చేసిన పాపాలు రాష్ట్ర భవిష్యత్తుకు శాపాలుగా మారాయని, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్‌ను అప్పులు ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ఆరోపించారు. అమరావతి, పోలవరంను పూర్తిగా విస్మరించారని, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో ఎంతో మందిని మోసం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈ 10 శాతంలో 5 శాతం కాపులకు కేటాయించిన రిజర్వేషన్లను కావాలని అమలు చేయడం లేదని, మిగిలిన ఐదు శాతంలో రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ తదితర అగ్రవర్ణాలను కావాలనే మోసం చేస్తున్నారని, ముందు దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని పోతిన వెంకట మహేశ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసిన జగదీష్, నుచర్ల పవన్ కళ్యాణ్, దేవకి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed