AP Inter: సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

by Disha Web Desk 16 |
AP Inter: సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. బుధవారం సాంయంత్రం ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన బోర్డు..ఇవాళ అదే సమయానికి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. ఇంటర్ బోర్డు అధికారులు ఈ పరీక్షలను మే 24 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్నారు. ఉదయం ఇంటర్ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జూన్ 3న పర్యావరణ విద్య పరీక్ష, జూన్ 5 నుంచి 9 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.

ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్

కాగా ఏపీ ఇంటర్ ఫలితాలను బోర్డు అధికారులు పరీక్ష జరిగిన 22 రోజుల్లో ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలను బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఫస్టియర్ ఉత్తీర్ణత 61 శాతం కాగా, సెకండియర్ 72 శాతంగా ఉంది. ఫస్టియర్‌లో 2,66,326 మంది పాస్ కాగా సెకండియర్‌లో 2,72,001 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత 65 శాతం, బాలుర ఉత్తీర్ణత 58 శాతంగా ఉంది. సెకండియర్‌లో ఉత్తీర్ణత 75 శాతం, బాలుర ఉత్తీర్ణత 68 శాతంగా నమోదు అయింది. ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా పాస్ అయ్యారు. అత్యల్పంగా కడప విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారు. సెకండియర్ ఫలితాల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 83 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అత్యల్పంగా విజయనగరంలో నమోదు అయింది. అయిదే ఫస్ట్ అండ్ సెకండియర్‌లోనూ బాలికలే టాప్ రావడం విశేషం.

అయితే పరీక్షలు ముగిసిన వెంటేనే స్పాట్ వేల్యూషన్ నిర్వహించారు. గత సంవత్సరం కంటే మిన్నగా సంతృప్తిగా పరీక్షలు, పేపర్ వేల్యూషన్ నిర్వహించారు. విద్యార్థులు bieap.apcfss.in. ap. అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అవకాశం కల్పించారు..



Next Story

Most Viewed