ఉత్కంఠకు తెర.. టీడీపీ గూటికి బైరెడ్డి

by Disha Web Desk 16 |
ఉత్కంఠకు తెర.. టీడీపీ గూటికి బైరెడ్డి
X

దిశ ప్రతినిధి, కర్నూలు : ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం

Former MLA Baireddy Rajasekhara Reddy and his daughter, BJP Nandyala district president Dr. Baireddy Sabari joined TDP in the presence of Chandrababu Chandrababu at TDP chief Chandrababu's residence in Vijayawada. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బైరెడ్డి కుమార్తె డాక్టర్ బైరెడ్డి శబరికి నంద్యాల పార్లమెంట్ టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించి నేడు ప్రకటించనున్న టీడీపీ మూడో జాబితాలో అధికారికంగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు అరెస్టుకు ముందు నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే తరువాయి అని పార్టీ నేతలు అంటున్నారు. బైరెడ్డి చేరికతో ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీకి పూర్వ వైభవం రానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తు్న్నారు. శబరికి ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల బైరెడ్డి అనుచరులు, టీడీపీ కార్యకర్తలు, నేతలు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

నాడు ప్రత్యర్థులు..నేడు మిత్రులు

నందికొట్కూరు నియోజకవర్గంలో నాడు రాజకీయంగా ప్రత్యర్థులుగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డిలు నేడు అందరూ టీడీపీ గూటికి చేరుకోవడంతో రాజకీయంగా మిత్రులుగా మారారు. వీరంతా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కలిసి పని చేయనున్నారు. రాజకీయంలో శాశ్వత శత్రువులు గానీ..శాశ్వత మిత్రులుగా గానీ ఉండరనే దానికి కోట్ల, కేఈలతో పాటు గౌరు, బైరెడ్డి, మాండ్రలు నిదర్శనంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నుంచి మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, భూమా బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story