Machilipatnam: కన్నతల్లిపై దాష్టీకం... కటకటాలపాలైన కొడుకు, కోడలు

by Disha Web Desk 16 |
Machilipatnam: కన్నతల్లిపై దాష్టీకం... కటకటాలపాలైన కొడుకు, కోడలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన జీవితంలో ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పింది ఆ తల్లి. ఉపాధ్యాయురాలిగా ఎందరో భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దింది. కొడుకు భవిష్యత్ కోసం తన జీతం డబ్బులతో రూపాయి రూపాయి పోగుచేసి మూడంతస్తుల భవనం నిర్మించి ఇచ్చింది. అంత ప్రేమ చూపించి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసిన తల్లిని రిటైర్డ్ అయిన తర్వాత కొడుకు దుర్మార్గుడిగా మారాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిపోయి చావు దెబ్బలు కొట్టాడు. కొడుకు చేతిలో ఎక్కడ చనిపోతాననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం టౌన్‌లో వెలుగులోకి వచ్చింది.


ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైర్

లక్ష్మణరావుపురంకు చెందిన తంటేపూడి విక్టోరియా ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైర్ అయ్యారు. భర్త వీరాస్వామి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు సంతానం. అయితే గత మూడేళ్లుగా కొడుకు నటరాజ్, కోడలు కొల్లి విద్యాదరిలు పెన్షన్ డబ్బుల కోసం తీవ్రంగా వేధిస్తున్నట్లు రిటైర్డ్ ఉద్యోగి విక్టోరియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెన్షన్ డబ్బులు విక్టోరియా తన కూతుళ్ళకి ఇస్తుందనే అనుమానంతో కొడుకు నటరాజ్ కోడలు విద్యాదరితో కలిసి కర్రలతోచావబాదుతున్నారని మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఏటీఎం కార్డు తీసుకొని ఫిర్యాదు పెన్షన్ డబ్బులను వాడుకుంటున్నాడని ఆరోపించింది. ఏటీఎం కార్డు అడుగుతుంటే చావబాదుతున్నాడని కన్నీరుమున్నీరైంది. దెబ్బలు తాళలేక బట్టలలో యూరిన్ పోసుకుంటున్నానని వాపోయారు. చావుభయంతో బిక్కుబిక్కమంటూ గదిలో ఓ మూలన కూర్చుని ప్రాణాలు కాపాడుకున్నాను అని బోరున ఏడ్చారు.

కొడుకు, కోడలు కొట్టిన దెబ్బలకు నల్లగా కమిలిపోయిన చర్మం

అయితే కొడుకు, కోడలు కొట్టిన దెబ్బలకు చర్మం కమిలిపోయి నల్లగా మారిపోయింది. ఆమె చర్మం, కంటిపై గాయాలను చూసి పోలీసులు సైతం చలించిపోయారు. బాధితురాలి విక్టోరియా ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా రంగంలోకి దిగారు. మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసుం బాషా పర్యవేక్షణలో మచిలీపట్నం పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి, కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఎవరైనా పిల్లలు వృద్యాప్యంలో ఉన్న వారి తల్లితండ్రుల పట్ల సరి అయిన బాధ్యత లేకుండా వారిని హింసించినా, వారి పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించిన అటువంటి వారి మీద కేసులు పెట్టి వారిని జైలుకి పంపిస్తాం అని పోలీసులు హెచ్చరించారు.

Next Story

Most Viewed