- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
రాష్ట్రానికి ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండా: సీపీఐ, సీపీఎం

దిశ, ఏపీ బ్యూరో: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, రాబోయే ఎన్నికల్లోను ఏపీకి ఇదే ప్రధాన ఎజెండా అవుతుందని సీపీఐ, సీపీఎం కార్యవర్గ నేతలు పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని మండిపడ్డారు. హోదాపై పోరాడుతానన్న జగన్ మడమ తిప్పారని విమర్శించారు. ప్రత్యేక హోదా యాత్ర, విజయవాడకు చేరుకుంది. విద్యార్థి, యువజన సంఘాల యాత్రకు అక్కడి నేతలు ఘన స్వాగతం పలికారు. మోడీ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఎలుగెత్తి చాటారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై విస్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రము నుంచి ఎన్నికైన వైసీపీ, టీడీపీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ మరోసారి హోదా, విభజన హామీల అమలుపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.