- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Ap News: సీపీఎం నేతలపై కేసులు
by Disha Web Desk 16 |

X
దిశ, ఏపీ బ్యూరో: అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అంగన్వాడీల ఉద్యమానికి సంఘీభావంగా సీపీఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరావు, వీ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణతోపాటు మరికొందరు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీం పట్నం పోలీసు స్టేషన్కు తరలించారు. గవర్నర్ పేట పోలీసులు మొత్తం 14 మంది సీపీఎం నేతలపై ఐపీసీ 143,188,341 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు
Next Story