Mailavaram: రంగంలోకి Cm Jagan.. ఫీడ్ బ్యాక్ కోసం కసరత్తు

by srinivas |   ( Updated:2022-12-14 12:51:43.0  )
Mailavaram: రంగంలోకి Cm Jagan.. ఫీడ్ బ్యాక్ కోసం కసరత్తు
X

దిశ వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కొంతకాలంగా మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వారిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా నడించింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని వారిద్దరితో మాట్లాడారు. అయినా సరే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగిరమేశ్ వెనక్కి తగ్గడం లేదు. మైలవరంలో పోటీ చేసేందుకు సై అంటే సై అంటూ సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే మిగిలిన సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed