- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Ap News: ఏం చేసినా వెనక్కి తగ్గం.. పోలీసులకు అంగన్వాడీల స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, ఏపీ బ్యూరో: అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని సోమవారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అంగన్ వాడీలను విజయవాడ రానివ్వకుండా నిర్బంధించారు. శాంతియుత నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను పోలీసులు కాలరాయడాన్ని కార్మిక సంఘాలు కన్నెర్ర జేస్తున్నాయి. ఈ ఘటనపై టీడీపీ యువనేత నారా లోకేష్ స్పందించారు. అంగన్వాడీల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. టీడీపీ అంగన్వాడీ కార్యకర్తల అసోసియేషన్ నేత సునీత ఘటనను ఖండించారు. ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ అఖిల భారత ట్రేడ్ యూనియన్లు మంగళవారం రాష్ట్ర వాప్త నిరసనకు పిలుపునిచ్చాయి.
అంగన్వాడీలను విజయవాడలోని పలు ఫంక్షన్ హాళ్లలో నిర్బంధించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ నేతలు ఏవీ నాగేశ్వరరావు, కారుసాల సుబ్బరావమ్మ, బేబిరాణి, జీ ఓబులేసు, లలితమ్మ, పోలారి అరెస్టులను అఖిల భారత ట్రేడ్ యూనియన్స్ ఖండించాయి. ‘తెలంగాణ కన్నా ఒక్క రూపాయి అయినా ఎక్కువగా ఇస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. దీనికి అదనంగా మరింత పని భారం పెంచారు. తట్టుకోలేక అంగన్వాడీలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీనిపై న్యాయం చేయాలని రోడ్డెక్కితే పోలీసులను ఉసిగొల్పడం దారుణం.’ అని కార్మిక సంఘాల నేతలు దుయ్యబట్టారు. పోలీసుల తోపులాటలో అనంతపురం జిల్లా అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు శంకుతలకు పోలీసుల తోపులాటలో మోకాలికి గాయమైంది. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.