Ibrahimpatnam: టువీలర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

by srinivas |   ( Updated:2023-07-05 11:09:41.0  )
Ibrahimpatnam: టువీలర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కారు డ్రైవర్ రెండు నిండు ప్రాణాలను బలిగొన్నారు. రోడ్డుపై అతివేగంగా కారు నడిపి ఓ కుంటుంబంలో విషాదం నింపారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహ్రీంపట్నం సత్యనారాయణపురంలో జరిగింది. డ్రైవర్ అతి వేగంగా కారును నడుపుతూ టీవీఎస్‌ఎక్సెల్‌పై కూతురితో వెళ్తున్నదంపతులను ఢీకొట్టారు. ఈ ఘటనలో భార్య మల్లాది నాగలక్ష్మి, కూతురు కీర్తన మృతి చెందారు. భర్తకు గాయాలయ్యాయి. నాగలక్ష్మి, కీర్తన మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం తాగి కారు డ్రైవింగ్ చేశాడా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed