కృష్ణా జిల్లాలో అరుదైన తాబేలు దర్శనం

by srinivas |
కృష్ణా జిల్లాలో అరుదైన తాబేలు దర్శనం
X

దిశ, జగ్గయ్యపేట: జగ్గయ్యపేట మండలం గౌరవరంలో అరుదైన అటవీ తాబేలు దర్శనమిచ్చింది. గౌరవరం గ్రామానికి చెందిన సత్యనారాయణకు ఎన్ఎస్పీ కెనాల్ సమీపంలో తాబేలు కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గండ్రాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రసన్న లీల తాబేలును సేకరించారు. అటవీ ప్రాంతంలో గడ్డి తింటూ నివసించే తాబేలుగా గుర్తించి పోచంపల్లి ఫారెస్ట్ బ్లాక్‌లో విడిచిపెట్టినట్లుగా ప్రసన్న లీల తెలిపారు..Next Story

Most Viewed