అస్వస్థత లేదు.. ఏం లేదు.. బాగానే ఉన్నా : కొడాలి నాని

by srinivas |
అస్వస్థత లేదు.. ఏం లేదు.. బాగానే ఉన్నా : కొడాలి నాని
X

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరిగింది. తన స్వగృహంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారని.. వైద్యులు ఆయనకు చికిత్స చేశారన్న వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో కొడాలి నాని స్పందించారు. తాను బాగానే ఉన్నానని తెలిపారు. ‘అస్వస్థత లేదు.. ఏం లేదు. నా అనారోగ్యంపై వచ్చిన వార్తలను ఖండిస్తున్నా.’ అని నాని తెలిపారు. అంతేకాకుండా తాను కుర్చీలో కూర్చున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Next Story

Most Viewed