Ap News:నూతన మద్యం పాలసీ టెండర్లపై కీలక సమాచారం

by Jakkula Mamatha |
Ap News:నూతన మద్యం పాలసీ టెండర్లపై కీలక సమాచారం
X

దిశ,పెదకూరపాడు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా నూతన మద్యం షాపుల ఏర్పాటుకు పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గారి నుండి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా ఎక్సైజ్ సి.ఐ.టి తులసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు మద్యం షాపులకు టెండర్లు వేయవచ్చని అయితే ఏ ప్రాంతం వారు టెండర్లు వెస్తున్నారు దానికి ఓ నెంబర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్‌లో క్రోసూరు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో క్రోసూరు మండలంలో 4 మద్యం షాపులు, అచ్చంపేట మండలంలో 4 మద్యం షాపులు, బెల్లంకొండ మండలంలో రెండు చొప్పున క్రోసూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 10 షాపులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడమైనది అని తెలిపారు.

ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నగదు అన్‌లైన్ ద్వారా బ్యాంకుల నుంచి డీడీల రూపంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ నగదు పూర్తిగా నాన్ రిఫండబుల్ నగదు అని దరఖాస్తు దారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ టెండర్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని వేసిన టెండర్లు, పల్నాడు జిల్లా కలెక్టర్ సమక్షంలో తెరవబడతాయని వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.ప్రభుత్వ విధి విధానాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దీని ప్రకారం షాపులను కేటాయింపు చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన ప్రతి షాప్‌కి ఎంత మంది అయిన టెండర్లు వేయవచ్చని దానికి సంబంధించి ఒక్కో టెండర్ కు 2 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. క్రోసూరు మరియు అచ్చంపేట మండలాలలో షాపులకు వార్షిక లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు, బెల్లంకొండ మండలం లో 55 లక్షల రూపాయలు గా నిర్ణయించారని తెలిపారు.పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed