‘పవన్ కల్యాణ్ గెలిచాక రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తా’ (వీడియో)

by GSrikanth |
‘పవన్ కల్యాణ్ గెలిచాక రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తా’ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతన్నా అందరి దృష్టి పిఠాపురం వైపే ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గ పోలింగ్ చర్చనీయాంశమైంది. ఈ సెగ్మెంట్‌లో గతానికి మించి పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. నగరాల్లో స్థిరపడిన వారు, ఉద్యోగం రీత్యా ఇతర దేశాలకు వెళ్లిన వారు సైతం ఇవాళ సొంత గ్రామాలకు వచ్చి ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. వృద్ధులు, మహిళలు, యువకులు, యువతులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. పోలింగ్ వేళ ఓ మహిళ పవన్ కల్యాణ్‌పై అభిమానం చాటుకుంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తానని చెప్పడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆ మహిళ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇది జనసైనికులకు సైతం షేర్లు, రీట్వీట్లతో రచ్చ చేస్తున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ఎన్నికల అధికారులు ఒక గంట పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed